మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) వివిధ కాలనీలలో పర్యటించారు. గుడ్ మార్నింగ్ మణికొండ ( Good Morning Manikonda ) పేరిట నిర్వహిస్తున్న ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం పుప్పాలగూడ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో ( Tirumala Hills Colony) నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
రోడ్డు నంబర్ 14 పందెం వాగు వరకూ విస్తరించి ఉండగా బఫర్ జోన్ రహదారి స్థలాన్ని రాజకీయ పరపతితో రిజిస్టర్ చేయించుకొని అడ్డుగా గోడ కట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రక్కనే మట్టి దిబ్బల మూలంగా వర్షాకాలంలో పై నుంచి వచ్చే వరద నీరు సాఫీగా వాగులోకి వెళ్లడానికి అవకాశం లేక అపార్ట్మెంట్లు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మంచినీటి సరఫరా సక్రమంగా లేదని , భూగర్భ జల మట్టాలు( Ground water) తగ్గిపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధార పడుతున్నామని అన్నారు. ఇదే సాకుగా ట్యాంకర్ల డ్రైవర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు నంబర్ 14 చివరలో విద్యుత్ సరఫరా సరిగా లేదని పై పెచ్చు వీధి దీపాలు వెలగడం లేవని చిమ్మ చీకటిలో బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారని ఆరోపించారు.
సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనులు సక్రమముగా సరి చేయాలని బీఆర్ఎస్ నాయకులు కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, ఉపేంద్రనాథ్ రెడ్డి, బుద్ధోలు బాబు, బండమీది మల్లేష్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్, సుమనళిని, యాలాల కిరణ్ కాలనీల్లో పర్యటించారు.