బేగంపేట్, నవంబర్ 17 : ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్ట మసీదు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. మసీదులో ముస్లిం సోదరులు ప్రార్థనలు ముగించుకొని బయటకు వచ్చిన అనంతరం వారిని కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మంత్రిని సన్మానించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, యాసిన్, రషీద్, షకీల్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
సనత్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును తెలిపింది. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. త్వరలో పెద్దఎత్తున ఏర్పాటు చేయబోయే సమావేశానికి హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో ప్రతినిధులు ఉమామహేశ్వర్, సయ్యద్, రఘు, ప్రశాంత్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.