Hyderabad |దేశంలోనే అతిపెద్ద స్టీల్‌బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించింది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు రూ. 450 కోట్లతో 2.6 కి.మీటర్ల దూరం నాలుగు లేన్ల వెడల్పుతో ఈ వంతెనను ఏర్పాటు చేసింది. దివంగత హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్‌గా దీనికి పేరు పెట్టారు.
ఇటు రాంనగర్, విద్యానగర్, ఓయూ, ముషీరాబాద్, నల్లకుంట, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి అటు లోయర్ ట్యాంకు బండ్, దోమలగూడ, అశోక్‌నగర్, చిక్కడపల్లి రాకపోకలు సాగించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. గతంలో అర్ధగంట సమయం పట్టేదని ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఈ చివరి నుంచి ఆ చివరకు చేరుకుంటున్నామని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.