Hyderabad | శేరిలింగంపల్లి, జూన్ 21 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాన్ని ధారపోసిన గొప్ప మహనీయుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ ఖాజా గూడా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా, ఊపిరిగా ఆయన ముందుకెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజమ్మ, మాధవి, దార్గుపల్లి నరేష్, నారాయణ, రమేష్ గౌడ్, నరేష్ సింగ్,అలీం, తాహెర్, బురాన్, తదితరులు పాల్గొన్నారు.