బడంగ్‌పేట, జనవరి 25 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో ముందుకు సాగుతూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో రూ.15.24 కోట్ల అభివృద్ధి పనులకు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆర్ఎన్బీ రోడ్డు కోసం నిధులు అడిగిన వారం రోజుల్లోనే రూ.14 కోట్లు కేటాయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ నేతలు మాటలు తప్ప.. చేసేదేమీ లేదన్నారు. మన రాష్ట్రంలో 2వేల పింఛన్ ఇస్తే.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 600 మాత్రమే పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.1200లకు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వసతులు, సౌకర్యాలు బాగున్నాయని గుజరాత్‌కు చెందిన కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని దీన్ని బట్టిచూస్తే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రైతులకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నందున మహారాష్ట్రకు చెందిన రైతులు ఆదిలాబాద్‌లో భూములు కొంటున్నారని చెప్పారు. ఇవన్నీ బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని.. ఉపాధ్యాయుల సంఖ్యను సైతం పెంచుతున్నామని.. ఇకనుంచి మీ బిడ్డలను ప్రభుత్వ బడులకే పంపాలని కోరారు.