జూబ్లీహిల్స్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యపై మంగళవారం రాత్రి కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. వెంగళరావునగర్ కార్పొరేటర్ అయిన దేదీప్య కారును అడ్డగించి మహిళలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి.
దాడి ఘటనపై కార్పొరేటర్ దేదీప్య, ఆమె భర్త విజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతల అండతోనే మహిళలు తనపై దాడికి పాల్పడ్డారని కార్పోరేటర్ దేదీప్య ఆరోపించారు. ఫ్లెక్సీల విషయంలో మొదలైన వివాదమే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తున్నది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి. pic.twitter.com/uZwzHKxq6E
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2024