KCR Birthday Celebrations | ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయాలు, మసీదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాల పంపిణీ, పేషేంట్స్ పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని సైతం ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 70వ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేయనున్నట్లు వివరించారు.