మూసీ బాధితులకు అండగా ఉంటాం
మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి ఆరోపించారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హిమాయత్‌సాగర్ గ్రామంలో భూ బాధితులతో ఆయన సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి
బండ్లగూడ: మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి ఆరోపించారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హిమాయత్‌సాగర్ గ్రామంలో భూ బాధితులతో ఆయన సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ పేదల భూములను తీసుకోవడం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నరేండ్లు గడుస్తున్నా ప్రజలకు న్యాయం చేయలేకపోయందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే..పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. మూసీ అభివృద్ధి కోసం భూములు తీసుకోవాల్సి వస్తే బాధితులకు న్యాయబద్ధమైన పరిహారంతో పాటు తగిన నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రేమ్‌కుమార్‌గౌడ్, ఆర్.నాగరాజు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

