సుల్తాన్‌బజార్, ఆగస్టు 2: జడ్చర్లలో కరెంటుషాక్‌తో పదేండ్ల బాలుడు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జడ్చర్లలో బాలుడు శ్రేయాన్ విద్యుదాఘాతంతో చనిపోయాడు.
ట్రాన్స్ఫార్మర్ వద్ద వేర్వేరు సమయాల్లో ఆవు, వీధి కుక్క కరెంటు షాక్‌తో మరణించినా.. ఆ ఘటనలపై అధికారులు స్పందించకపోవడంతో తన కుమారుడు అదే చోట చనిపోయాడని.. బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో టీజీ ట్రాన్స్కోని బాధ్యులుగా పరిగణిస్తూ మృతుడి తల్లి దండ్రులకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. ట్రాన్స్‌కో సీఎండీని తెలంగాణలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల భద్రత పరిస్థితిపై నివేదిక, ఘటనల నివారణ చర్యలతో పాటు నిత్యం తనిఖీలు చేయాలని, బాలుడి మృతికి కారణమైన నిర్లక్ష్యపు అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టి..చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.