వెంగళరావునగర్, మే 18 :కన్న తల్లి కాలం చేసింది. తండ్రి మరో పెండ్లి చేసుకున్నాడు. సవతి తల్లి, ఆమె పిల్ల లు, తండ్రితో పాటు మెదటి భార్య కుమారుడితో తీర్థయాత్రలకు వెళ్లాడు. కోనేటి చెరువులో ఆ 9 ఏండ్ల బాలు డు అనుమానాస్పదంగా మృతి చెందడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమో దు చేసి కేసును ఏపీకీ బదిలీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌కు చెందిన చిత్తాల నవీన్‌కు రేణుకతో 2004వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కలిగాడు. ఐదేళ్ల క్రితం రేణుక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ మరుసిటి ఏడాది 2022లో అశ్విని అనే మరో మహిళను పెళిల చేసుకున్నాడు.
ఆమె భర్త కూడా కరోనాలో మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె కవలలు. తన పిల్లలతో పాటు.. మెదటి భార్య కుమారుడిని కూడా ఆమె చూసుకుంటుంది. ఈ నెల 14న అశ్విని కుమారుడి పుట్టినరోజు సందర్భంగా భర్తతో కలిసి పిల్లలందర్ని వెంటబెట్టుకుని తీర్థయాత్రల కోసం ఏపీకి వెళ్లారు. ఈ నెల 17వ తేదీ కోనసీమలోని కోటిపల్లి శివాలయానికి వెళ్లామని, అక్కడి కొనేరులో మొదటి భార్య కుమారుడు ఆదిత్య(9) నీటిలో మునిగి మృతి చెందాడని నవీన్ ఆదిత్య పెద్దమ్మకు చెప్పాడు. సోమవారం యూసుఫ్‌గూడకు మృతదేహాన్ని తెచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఆదిత్య పెద్దమ్మ దేవకిరాణి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ఏపీకి బదిలీ చేశారు.