ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
మల్లాపూర్, మార్చి 11 : కాలనీల ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాక్స్ డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కార్పొరేటర్ ప్రభుదాస్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీర్పేట్ డివిజన్ మంగపురం కాలనీ ఇందిరనగర్ ఫేస్-1లో సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో కాలనీలలో నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కాలనీలలో ముంపు సమస్య తలెత్తకుండా బాక్స్డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పనులు పూర్తైతే ఇక లోతట్టు ప్రాంతాలలో ముంపు సమస్య ఉండదని పేర్కొన్నారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ రాకేశ్, వర్క్ ఇన్స్పె క్టర్ చారి, నాయకులు వసంతరావు, బ్రహ్మాచారి, సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, చారి, అశోక్, సాయికుమార్, శేఖర్‌గౌడ్, నవీణ్గౌడ్, జయపాల్, రామక్రిష్ణ, నిస్సార్, మల్లేశ్, రమేశ్, రాజు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.