Army Public School | బొల్లారం, జనవరి 29: బొల్లారంలోని ఆర్మీ పాఠశాలకు బుధవారం ఆకతాయిలు నుంచి ఈ-మెయిల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆర్మీ, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్ అధికారులు విద్యార్థులను ఇంటికి పంపించి పాఠశాలలో, చుట్టు పక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు బెదిరింపును ఆర్మీ పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా మెసేజ్ పంపించినట్లు ఆర్మీ పోలీస్ అధికారులు గుర్తించారు.
ఈ మెయిల్ మెసేజ్ బెదిరింపు తమిళనాడు నుంచి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ మెసేజ్ తప్పుడు మెసేజ్ అని, గుర్తు తెలియని ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని అధికారులు తేల్చారు. ఇలాంటి వదంతులు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని, ఈ విషయమై ఆర్మీ, పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు.