BJP Leaders : బంగారం డిపాజిట్ కేసులో తెలంగాణలోని ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులపై కేసు నమోదైంది. ఉప్పల్లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Siri Gold Merchants Pvt Ltd) అనే ప్రైవేట్ కంపెనీలో భాగస్వాములైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర(Kosampudi Ravindra), బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు(Nelluru Koteshwar Rao)పై బాధితులు కేసు పెట్టారు. రవీంద్ర, కోటేశ్వర్ రావులు పెట్టుబడిదారులను నమ్మించి రూ. 20 కోట్లు వసూలు చేశారు.
సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలు చూపిస్తామని కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావు పలువురిని మభ్యపెట్టారు. లాభాల ఆశ చూపి వేలాది మందితో సిరి గోల్డ్ మర్చంట్స్ కంపెనీలో రూ.20 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టించారు. అయితే.. ప్రమోటర్లు చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు లాభాలు ఇవ్వలేదు. వారి డబ్బులను సైతం తిరిగి ఇవ్వలేదు. దాంతో.. తాము మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి.. సిరిగోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై, కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేశారు.
రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదు
ఉప్పల్లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు… pic.twitter.com/foZKsdCNjn
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2025