బండ్లగూడ, ఫిబ్రవరి 24: ఇంటి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేసి బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం పరిధిలో కలకలం రేపింది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీలోని మైలార్దేవ్ పల్లి బిల్ కలెక్టర్ మధు ఓ వ్యక్తిని ఆస్తి పన్ను పెట్టకుండా చూస్తామని, అందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బాధితుడు మల్లాడిదేవ్పల్లిలోని మహిపాల్ హోటల్ వద్ద రూ.45 వేలు బిల్ కలెక్టర్ మధు అసిస్టెంట్ రమేష్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మధు, రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.