హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రాత్రిపూట బైకర్స్ వీరంగం సృష్టించారు. కాలాపత్తర్‌లోని ఓ కాలనీలో బైక్‌లతో యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశారు. అయితే కాలనీలో ర్యాష్‌గా ఎందుకు నడుపుతున్నారని ఓ యువకుడు వారిని ప్రశ్నించాడు. దీంతో ఆ యువకుడిని బైకర్స్ చితకబాదారు. అతని ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కుటుంబసభ్యులు వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీల ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.