కొత్తూరు, సెప్టెంబర్ 1 : బిగ్‌టీవీ రిపోర్టర్ మునవర్ ఫయాజ్ను కొత్తూరు పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఫయాజ్ మునావర్ గతంలో పలు చానళ్లలో పని చేశాడు. నేను రిపోర్టర్‌ను.. అని చెప్పి జేపీ దర్గాలో కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, వ్యాపారులు, పలు కంపెనీలు, పాఠశాలల యాజమాన్యాల వద్దకు వెళ్లి నెలవారీ వసూళ్లకు పాల్పడేవాడు.
అతడి అవినీతిపై ఆయా చానళ్ల యాజమాన్యాలకు ఫిర్యాదులు అందడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత బిగ్ టీవీతో పాటు, సొంతంగా యూ ట్యూట్ చానల్‌ను ఏర్పాటు చేసుకొని ఇన్మునర్వ గ్రామానికి చెందిన మీర్జా షౌకత్, సదాక్ అలియాస్ ఎంపీ సాధిక్, ఎండీ జమీల్ అన్సారీ, ఎండీ అఖిల్ అన్సారీ మరికొంతమందితో కలిసి బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారితో దౌర్జన్యాలకు పాల్పడుతూ వసూళ్లు కొనసాగిస్తున్నాడు. జేపీ దర్గా సబ్ కాంట్రాక్టర్లు హబీబ్, సయ్యద్ రఫీక్, నవాజ్, సయ్యద్ మహమూద్, సయ్యద్ అజ్మత్, అజ్మత్ వద్ద నుంచి ప్రతినెలా రూ.10వేలు, రూ. 20 వేలు వసూలు చేశాడు.
అనంతరం ఏక మొత్తంలో రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో సబ్ కాంట్రాక్టర్లు ఒప్పుకోలేదు. ఆగస్టు 30న వారిని కట్టెలు, చెక్కలు, చాకుల, బజ్జీలు చేసే గంటెలతో కొట్టి గాయపరిచారు. దీంతో రఫిక్ కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సీఐ నరసింహారావు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టు 31 సాయంత్రం నిందితులు తిమ్మాపూర్ బస్టాప్‌లో తారసపడ్డారు. ఫయాజ్, అతడి తండ్రి ఎండీ సయ్యద్, జమీల్ అన్సారీ, అఖిల్ అన్సారీలను ఆదివారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.