సిటీ బ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): పతంజలి ఆధ్వర్యంలో ఆచార్యకులం విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటారని ప్రిన్సిపల్ స్వాతి మున్షి ప్రకటించారు. 99.4 శాతం మార్కులతో అధర్వ్ ప్రథమ స్థానం, 98 శాతం మార్కులతో ధ్రువ్ ద్వితీయ, 97.8 శాతం మార్కులతో సాన్య షేజల్ తృతీయ స్థానంలో నిలిచారని వెల్లడించారు. అదేవిధంగా 153 మంది విద్యార్థులు ఏ1 గ్రేడ్ మార్కులు సాధించారని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆచార్యకులం మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు అభినందించారు.