హైదరాబాద్: ప్రముఖ చైనీస్ ఫార్మా కంపెనీ రెక్‌బయో టెక్నాలజీ కంపెనీతో బయోలాజికల్ ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిలో భాగంగా హెచ్‌పీవీ9 వ్యాక్సిన్(HPV9 Vaccine)ను ఉత్పత్తి చేయనున్నారు. రెక్‌బయో కంపెనీ .. బీఈ సంస్థకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనున్నది. హైదరాబాద్‌కు చెందిన బీఈ కంపెనీకి.. డ్రగ్ సబ్స్టన్స్, టెక్నాలజీని రెక్‌బయో కంపెనీ అందించనున్నది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లో హెచ్‌పీవీ9 టీకాను వాణిజ్య పరంగా అమ్మేందుకు పూర్తి స్థాయి హక్కులు రానున్నాయి. HPV9 టీకాను.. రికాంబినాంట్ వ్యాక్సిన్‌గా డిజైన్ చేశారు. సుమారు తొమ్మిద రకాల హ్యూమన్ పాపిల్లోమావైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. గర్భాశయ, యోని ప్రాంత, మూత్రాశయ, జననేంద్రియ మొటిమలు, నోటి క్యాన్సర్లకు కారణమైన వ్యాధల నివారణకు ఈ వ్యాక్సిన్ పనిచేయనున్నది.
హెచ్‌పీవీ గ్రూపులో సుమారు 200 వైరస్లు ఉన్నాయి. కొన్నింటిని హై రిస్క్ వైరస్‌లుగా గుర్తించారు. చాలా వరకు హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు.. ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా నయం అవుతాయి. హై రిస్క్ హెచ్‌పీవీ ల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉన్నది. మూత్రాశయ, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి. 2019లో హెచ్‌పీవీ వల్ల మహిళల్లో సుమారు 6.20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ఇక పురుషుల్లో ఆ సంఖ్య 70 వేలుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ వల్ల మహిళల్లో నాలుగోవంత మరణాలు సంభవిస్తున్నాయి. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో.. సుమారు 90 శాతం సర్వైకల్ క్యాన్సర్ లేదా.. మూత్రాశయ, జననేంద్రియ వ్యాధులు సోకవు. రెక్‌బయో కంపెనీకి చెందిన ఆర్ఈసీ603 ప్రస్తుతం 9 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి ఇస్తున్నారు. చైనాలో ప్రస్తుతం మూడవ దశ క్లినకల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పూర్తి అవ్వగానే, భారీ స్థాయిలో హెచ్‌పీవీ9 వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ సంస్థ ఉత్పత్తి చేయనున్నది.
బయోలాజికల్ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉన్నట్లు రెక్‌బయో కంపెనీ చైర్మెన్ డాక్టర్ లియూ యోంగ్ తెలిపారు. ఈ సహకారంతో అంతర్జాతీయ మార్కెట్లో తమ సంస్థ విస్తరించనున్నట్లు చెప్పారు. హెచ్‌పీవీ9 వ్యాక్సిన్‌ను ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ అందుబాటులో తెచ్చేందుకు రెక్‌బయో కంపెనీతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నట్లు బయోలాజికల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల తెలిపారు. కీలకమైన వ్యాక్సిన్లను అందుబాటులో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు మహిమ వెల్లడించారు.
#BiologicalELimited #BE #JiangsuRecbioTechnologyCompanyLimited #Recbio #HPV9Vaccine #HPV9 #Vaccine #HumanPapillomavirus #Recombinant9ValentHPV #DrugSubstancehttps://t.co/tCkQzOgep4 pic.twitter.com/ra0F68mGHn
— Biological E. Limited (@biological_e) June 30, 2025