Caste Census | సికింద్రాబాద్, ఫిబ్రవరి25: కుల గణన సర్వేలో పాల్గొనని వారు సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పిలుపునిచ్చారు. కుల గణన సర్వేలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బౌద్ధ నగర్, సీతాఫల్మండి తదితర డివిజన్లలో పర్యటించారు. అనంతరం ఆయన వారాసిగూడలోని జడ్ ఎం ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ….. కుల గణన సర్వేలో పాల్గొని వారు, మళ్లీ ఇప్పుడు తప్పకుండా సర్వే వివరాలు తెలపాలని కోరారు. ఆన్లైన్లో గాని ఇంటికి ముందు వచ్చే ఎనిమినేటర్లకు గాని వివరాలు తెలిపి సర్వేలో పాల్గొనాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే వివరాలు ప్రజల నుంచి తెలుసుకొని కులగణన సర్వే కానీ ఇంటికి ఎమ్యునరేటర్లను పంపి సర్వే చేపించారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ సంతోశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కుటుంబం కుల గణ సర్వేలో పాల్గొనాలని.. ఒకవేళ అందుబాటులో లేకపోతే వారు 040 21111111 నంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మాజీ ఉపాధ్యక్షులు సృజన్ కుమార్, మాదిరెడ్డి జలంధర్ రెడ్డి , షకీల్ ఖాన్, జామ అనిల్ కుమార్, వాహిదుద్దీన్ లడ్డు, ప్రతాప్, చక్రధర్, బబ్లు, కుద్దూస్, శేఖర్, శోభ, రాధ, కల్పన, కిరణ్, మహేశ్, ప్రేమ్, బాలరాజ్, బ్రహ్మాజీ, నిస్సార్, రమేశ్, జనార్ధన్, ఆమె తదితరులు పాల్గొన్నారు.