ఉప్పల్, సెప్టెంబర్ 23 : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకలు అందజేస్తున్నామని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అ న్నారు. శుక్రవారం నాచారంలోని భవానీనగర్ కమ్యూనిటీహాల్, ఎర్రకుంటలోని లాల్‌బహదూర్ శాస్త్రీ సామాజిక భవనంలో, అన్నపూర్ణకాలనీలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదే విధంగా డివిజన్లోని పలు ప్రాంతా ల్లో బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, సాంబశివరావు, దాసర కర్ణ, శ్రీరామ్ సత్యనారాయణ, సుగుణాకర్‌రావు, కట్ట బుచ్చన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, సెప్టెంబర్ 23 : చిలుకానగర్ డివిజన్లోని గణేశ్‌నగర్, సాయిరాంనగర్, శ్రీగిరికాలనీ, మహారాజ ఎన్క్లేవ్ కాలనీలలో శుక్రవారం కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. కా ర్పొరేటర్ మాట్లాడుతూ .. బతుకమ్మ పండుగ సందర్భం గా ఆడపడుచులకు చీరలు అందిస్తున్నామని పేర్కొ న్నా రు. తెలంగాణ ప్రభుత్వం పండుగలు వైభవంగా నిర్వహించుకునేవిధంగా సహకారం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి, నేతలు బన్నాల ప్రవీణ్, కొండల్‌రెడ్డి, జగన్, మాస శేఖర్, రామానుజం, నారాయణరెడ్డి, రవీందర్, బాలు, శ్రీకాంత్, శ్యాం, కాలనీవాసులు రాజమౌలి, లక్ష్మీనారాయణ, ఈశ్వ ర్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, సెప్టెంబర్ 23 : మల్లాపూర్ డివిజన్, నెహ్రూనగర్‌లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఓ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు బోదా సు లక్ష్మీనారాయణ, తీగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, తండా వా సుగౌడ్, నాగారం బాబు, శేఖర్, చిన్న దుర్గయ్య, రాపో లు శ్రీనివాస్, శ్రీకాంత్, మహేశ్, ధన్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.