శంషాబాద్ రూరల్, జూన్ 12 : భారతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించడమే హరేకృష్ణ మూవ్మెంట్ లక్ష్యమని సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధర్యంలో బేసిల్ వుడ్స్ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బేసిల్ వుడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్‌లో 9 ప్రీ స్కూల్స్, రెండు కేజీ టు 12 వరకు పాఠశాలలను నిర్వహిస్తూ 2వేల మంది పిల్లలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.
భారతీయ విజ్ఞానం ప్రస్తుత తరానికి చెందిన యువ మనస్సులను ఆకట్టుకుంటూనే వారిలో శాస్త్రీయ దృకృథాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తున్నట్లు చంచలపతి దాస ప్రభూజీ పేర్కొన్నారు. అక్షయపాత్ర వంటి కార్యక్రమాల ద్వారా విస్తృత సామాజిక ప్రభావాన్ని దేవాలయాలు, బోధన, సాంస్కృతిక ప్రభావాన్ని సృష్టించే విధంగా తయారు చేస్తున్నామని సత్యగౌర చంద్రదాస ప్రభూజీ తెలిపారు. ప్రారంభోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.