సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నూతన సీఈవోగా డా.కూరపాటి కృష్ణయ్య నియమితులయ్యారు. మంగళవారం బాలకృష్ణ సారథ్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన డా.కృష్ణయ్యను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బసవతారకం ఇనిస్టిట్యూట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, ఎం.భరత్, డా.నోరి దత్తాత్రేయ, డా.పోలవరపు రాఘవరావు, హాస్పిటల్కు చెందిన మెడికల్, నాన్ మెడికల్ హెచ్వోడీలు పాల్గొన్నారు.