సిటీబ్యూరో, జూలై 22 ( నమస్తే తెలంగాణ ) : బ్యాంక్ ఆఫ్ బరోడా 114వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వినియోగదారులకు సేవలందించిన వారిని సత్కరించారు. వీరితో పాటు ముంబైలోని వంగని రైల్వే స్టేషన్ సమీపంలో ఆరేండ్ల బాలుడు రైల్వే ట్రాక్‌పై పడిపోతే ప్రాణాలకు తెగించి ఆ బాలుడిని రక్షించిన మయూర్ శెల్కేను కూడా సత్కరించారు. ఈ ఏడాది ‘క్రియేటింగ్ వాల్యూ విత్ ట్రస్ట్’ థీమ్‌గా సేవలందించనున్నదని వివరించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫాం సేవలను కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చాదా మాట్లాడుతూ.. కొవిడ్ క్లిష్ట సమయంలో కూడా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మనోనిబ్బరంతో సేవలందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.