సైబర్ నేరగాళ్లకుసిటీ నుంచే ఖాతాలు..!
సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంలో ఈశాన్య, ఉత్తర రాష్ర్టాల బ్యాంకు ఖాతాదారులే ఎక్కువగా ఉండేవాళ్లు.
- ఈశాన్య రాష్ర్టాలకు పోటీ ఇస్తున్న తెలుగు రాష్ర్టాలు
- కమిషన్ల కోసం నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు
- 11 మందిలో 9 మంది తెలుగువాళ్లే..!
సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంలో ఈశాన్య, ఉత్తర రాష్ర్టాల బ్యాంకు ఖాతాదారులే ఎక్కువగా ఉండేవాళ్లు. నేడు అక్కడి నుంచి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రకు చెందిన వారు బ్యాంకు ఖాతాలను సైబర్‌నేరగాళ్లకు సరఫరా చేసే రాకెట్లోకి ఎంట్రీ అవుతున్నారు. ఇటీవల మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు 11 మంది సైబర్నేరగాళ్లను అరెస్ట్ చేశారు. అందులో తొమ్మిది మంది వరకు హైదరాబాద్‌తో పాటు ఏపీకి చెందిన వారే ఉండడం ఆందోళన కల్గిస్తోంది.
ఒక పక్క సైబర్‌నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య గత ప్రతి ఏడు పెరుగుతూ వస్తున్నది. పోలీసులు ఈశాన్య రాష్ర్టాలు, ఉత్తర భారతదేశంలో ఉన్న బ్యాంకు ఖాతాదారుల వరకు వెళ్లి ఆయా కేసులను అక్కడితో ఆపేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల వద్దనే కీలకమైన సైబర్ నేరగాళ్ల లింక్ కట్ అవుతూ వస్తోంది. చాల కేసులలో బ్యాంకు ఖాతాల లింక్‌లతో కీలక నిందితులను సైతం పోలీసులు పట్టుకున్న సందర్బాలున్నాయి. గతంలో సైబర్ నేరాలకు పాల్పడేవారు ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఎక్కువగా ఉండగా మోసపోయే వారు దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉంటూ వస్తున్నారు. కీలకమైన సైబర్ నేరగాళ్లు తెలంగాణ, ఏపీ వాసులపై దృష్టి పెట్టడంతో కమిషన్లకు కక్కుర్తి పడుతూ చాల మంది బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అందిస్తున్నారు.
టెలిగ్రామ్, వాట్సాప్..
సైబర్ నేరాలు చేయడం ఒక ముఠా పని అయితే.. కేవలం బ్యాంకు ఖాతాలను సేకరించడం మరో ముఠా పనిగా సాగుతున్నది. వీటికి టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ను వేదికగా చేసుకుంటున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్‌లో లాభాలంటూ మేసేజ్‌లు పంపించే వారు కొందరైతే, ఉద్యోగాలున్నాయంటూ మేసేజ్‌లు పెడుతూ వాళ్లతో కొన్నాళ్లు ఉద్యోగాల గూర్చి మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల ప్రస్తావన తెస్తున్నారు.
ఇలా బ్యాంకు ఖాతాలు తమకు ఇస్తే… మీ ఖాతాలో డిపాజిట్ అయ్యే మొత్తంలో 5 నుంచి 30 శాతం వరకు పరిస్థితులను బట్టి కమిషన్ ఇస్తామంటూ ప్రతిపాదనలు పెడుతూ ఈజీగా బ్యాంకు ఖాతాలను కీలకమైన సైబర్‌నేరగాళ్లు సేకరిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లో కమిషన్లు మాట్లాడుకుంటూ బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాను కమిషన్ పద్దతిలో అప్పగించే వారు, ఆయా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ పాస్వర్డ్ వివరాలన్ని బ్యాంకు ఖాతాలు సేకరించే ముఠా చేతికి అప్పగించాల్సి ఉంటుంది.
సైబర్‌నేరగాళ్ల ముఠాలకు కమిషన్ పద్దతిలో బ్యాంకు ఖాతాలను అప్పగించే వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆయా ముఠాలు కీలక నిందితులకు పంపిస్తుంటాయి. బాధితులను వివిధ రకాలుగా మోసాలు చేసే సైబర్‌నేరగాళ్లు, కమిషన్ పద్దతిలో సేకరించిన బ్యాంకు ఖాతాలలో బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ కాగానే ఆయా ఖాతాదారుల కమిషన్ మినహాయించుకొని మిగతా సొమ్ము నేరగాళ్లకు పంపించాలి.
అయితే ఆయా ఖాతాలను సైబర్‌నేరగాళ్ల ముఠాలే నిర్వహిస్తుండడంతో ఎప్పటికప్పుడు డిపాజిట్లకు సంబంధించిన మేసేజ్‌లు కూడా వాళ్లకే వస్తుంటాయి. బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ అయిన సొమ్ములో కమిషన్లు మినహాయించి మిగతా సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం, వాటిని ఏటీఎంల ద్వారా డ్రా చేయడం చేస్తుంటారు. ఇలా సైబర్‌నేరగాళ్లు మ్యూల్ ఖాతాలను అపరేట్ చేస్తున్నారు. అయితే ఈజీగా డబ్బు వస్తుండడంతో చాల మంది సైబర్‌నేరగాళ్ల ముఠాల చేతికి చిక్కుతున్నారు. ఇప్పుడు ఇలా బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారు హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

