Hyderabad | బంజారాహిల్స్, మే 20 : తనను పెళ్లి చేసుకోకపోతే నగ్న ఫొటోలు అందరికీ పంపిస్తానంటూ మహిళను వెంటపడి వేధిస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న మహిళ(22)కు నాలుగేళ్ల క్రితం పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది క్రితం ఆమెను భర్త వదిలిపెట్టి వెళ్లడంతో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. కాగా ఇటీవల అమెకు మహ్మద్ అబ్దుల్ గఫార్ (24) అనే ర్యాపిడో డ్రైవర్‌తో స్నేహం ఏర్పడింది.
ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఆమెకు సన్నిహితుడిగా మారాడు. త్వరలో పెళ్లి చేసుకుందామంటూ ప్రతిపాదన పెట్టాడు. కాగా గఫార్ ఇటీవల డ్రగ్స్‌తో పాటు మద్యానికి బానిసగా మారాడని గుర్తించిన ఆమె అతడితో పెళ్లికి నిరకారించింది. దీంతో ఆమెను రోజూ వేధిస్తుండడంతోపాటు దారికాచి దాడికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే తనతో దిగిన నగ్న పోటీలు అందరికీ పంపిస్తానంటూ వేధించాడు. దీంతో తనను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా దాడికి పాల్పడిన గఫార్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.