ఉత్సాహంగా ఫ్యాషన్ షో.. ఆకట్టుకున్న మోడల్స్
కళ్లు చెదిరే అందచందాలతో పలువురు మోడళ్లు అదరగొట్టారు. మోడలింగ్‌లో రాణించాలనుకునే వారి కోసం స్కై మోడలింగ్ ఇన్స్టిట్యూట్ బంజారాహిల్స్‌లో ఫ్యాషన్ షో నిర్వహించింది.
బంజారాహిల్స్, మార్చి 28: మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక యువతీయువకులను ప్రోత్సహించేందుకు స్కై మోడలింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఉత్సాహంగా సాగింది. యువతీయువకుల కళ్లు చెదిరే అందచందాలు.. వినూత్నమైన వస్త్రధారణతో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌తో హోయలు ఒలికించారు. మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని యువతకు అందించేందుకు ఈ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేసినట్లు ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ సలీమ్ ఇలాహీ తెలిపారు.