బంజారాహిల్స్,ఏప్రిల్10: మంత్రివర్గంలో లంబాడాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం నేతలు గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ నాయక్ నాయకత్వంలో పలువురు నాయకులు సీఎం రేవంత్ ఇంటివైపు దూసుకువెళ్లేందుకు యత్నించగా జూబ్లిహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ..అగ్రకుల అధిపత్యంలో నలిగిపోతున్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గుర్తింపు నివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులను అరెస్ట్ చేసి బొల్లారం, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లకి తరలించారు.
సేవలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సక్రి బాయి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర చందు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, జాతీయ ఉపాధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్, రమావత్ అభిషేక్ నాయక్, రాజేష్ నాయక్, శాంతి బాయ్, నాగు నాయక్, లాలు నాయక్, శ్యామల నాయక్, సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా కార్యదర్శి నాగరాజు నాయక్, నాయకులు శీను నాయక్త తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.