హైదరాబాద్: వినయాక చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలానికి (Ganesh Laddu) ప్రత్యేక స్థానం ఉంటుంది. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. దీంతో ఎంతైనా వెచ్చించి వేలంలో దక్కించుకోవడానికి సిద్ధపడుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాలో జరిగిన గణేశ్ లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన లడ్డూ వేలంలో కీర్తి రిచ్మండ్ విల్లావాసులు రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికడం గమనార్హం. మరోవైపు రాయదుర్గం మైహోమ్ భుజాలో గణేష్ లడ్డు రూ.51,77,777 లక్షలు పలికింది.
మైహోమ్ భుజాలో రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డు
కాగా, ఎంతో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డూ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. బాలాపూర్ గణనాథుడు పురవీధుల్లో ఊరేగుతున్నారు. ఉదయం 8.30 గంటలకు ఊరేగింపు గ్రామం నడబొడ్డున ఉన్న బొడ్రాయి వద్దకు చేరుకోనుంది. అనంతరం లడ్డూ వేలం కొనసాగుతుంది. ఈ ఏడాది వేలంలో 38 మంది తమ పేర్లు నమోదుచేసుకున్నారు. గతేడాది వేలంలో లడ్డూ రూ.30.01 లక్షల పకిలింది.
రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లకు వినాయక లడ్డూ వేలంపాట
హైదరాబాద్ రిచ్మండ్ విల్లాస్‌లో లడ్డూను వేలంలో రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలకు దక్కించుకున్న కమ్యూనిటీ సభ్యులు pic.twitter.com/VYZThBjXlm
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025