RS Praveen kumar | మీడియా మిత్రులు మైనర్ అమ్మాయిల మీద లైంగిక దాడులు జరిగినప్పుడు వార్తలు రాసేటపుడు కొంచెం జాగ్రత్తగా రాయండని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. కొందరు మీడియా మిత్రులు యూనియన్ మినిస్టర్ కొడుకు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు అని రాస్తున్నారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం జరిగింది గాలికి వదిలేసి.. హనీ ట్రాప్ అనేది పెడుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హనీ ట్రాప్ అనేది ఇంత చిన్నోళ్ల మీద వెయ్యరు. హనీ ట్రాప్‌ను గూఢచారుల మీద వేస్తరని అన్నారు. దేశ అంతర్గత రహస్యాలు, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలుంటాయో వాటిని శత్రు దేశాలు కనిపెట్టడం కోసం కొంతమంది మహిళలను పంపించి వాళ్లను వీళ్లకు దగ్గరయ్యే విధంగా చూసి.. వాళ్లను కాంప్రమైజింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకొని ఆ వీడియోలు చూపిస్త నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్పి ఆ గూఢచారుల మీద చేసేది హనీట్రాప్. ఈ బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ 007 ఏం కాదు హనీట్రాప్ చేయడానికి ఖైదీ 786, ఏ 1, ఏ2లు అయితే హనీ ట్రాప్ చేస్తరన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఎందుకు ఆ అమ్మాయి మీద ఇలా.. బీజేపీలో ఉండే మహిళా సోదరీమణులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. మీరందరూ కూడా ఆ బాబు సాయిభగీరథ్‌ను తీసుకొచ్చిక్షమాపణ చెప్పించండని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ 007 ఏం కాదు హనీ ట్రాప్ చేయడానికి
హనీ ట్రాప్ అనేది గూఢచారుల మీద చేస్తారు
దేశ భద్రతకు సంబంధించిన అంతర్గత రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలు లాంటివి తెలుసుకోవడానికి శత్రుదేశాలు హనీ ట్రాప్ చేస్తారు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/0jiUilLShi pic.twitter.com/dJAzaWrnK0
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2026