అమీర్‌పేట్, జనవరి 3 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ శీఘ్ర దర్శన టిక్కెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్టు రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పలు పోస్టులు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రభుత్వ ఆధీనంలోని ఐటీఈ అండ్సీ విభా గం ద్వారా సమకూరిన యంత్రాలతో టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ విధానం గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది.
గతనెల జనవరి 12న మధ్యాహ్న సమయంలో అమ్మవారి దర్శనానికి శీఘ్ర దర్శన రూ.50 టిక్కెట్లను ఆలయ ఆవరణలోని గాలిగోపుర ద్వారం వద్ద ఆలయ అటెండర్ శ్రీహరి ఇస్తున్నాడు. అదే సమయంలో కొందరు భక్తులు తీసుకున్న శీఘ్ర దర్శన టిక్కెట్లు, ఒకే నంబర్‌తో మళ్లీ మళ్లీ వచ్చాయి. అయితే అప్పుడు ఈ విషయాన్ని దేవాలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు. దాదాపు 20 రోజుల తరువాత ఈ టిక్కెట్ల ఫొటో లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవు తుండడంతో దేవాలయ ఈవో అప్రమత్తమయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు…
అమ్మవారి దర్శర టిక్కెట్ల విషయంలో తలెత్తిన వివాదంపై ఎల్లమ్మ దేవాలయ ఈవో బి.క్రిష్ణ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామజిక మాధ్యమాల్లో వస్తున్న లక్షల్లో డబ్బులు దుర్వినియోగమయ్యాయనే విషయంలో వాస్తవం లేదని ఈవో తెలిపారు. ఏదేమైనా తాజాగా తలెత్తిన ఈ వివా దం భక్తుల మనోభావాలను మరింత దెబ్బతీయకుండా ఉండేందుకు వీలుగా వెంటనే దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే దే వాల యం తరపున ఓ అధికారితో ప్రాథమిక విచారణ కూడా చేపట్టినట్టు తెలిపారు. దేవాలయంలో చోటు చేసుకున్న ఉదంతం సాఫ్ట్వేర్ తప్పిదమా? లేక ఉద్యోగుల తప్పిదమా? అనే అంశంపై విచారణ జరుగుతుందని తెలిపారు.