సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా మంగళవారం ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్‌ను జీహెచ్ఎంసీకి బదిలీ చేయగా…ఇక్కడ ఉన్న ఇలంబర్తిని పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్ఎండీఏ పరిధి)గా నియమించారు.
ఇలంబర్తి నుంచి ఆర్వీ కర్ణన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగం ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డిని హెచ్ఎండీఏ సెక్రటరీగా నియమించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవ్‌రావును నియమించారు.