సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఆరాంఘర్ ఫ్లై ఓవర్ అప్ డౌన్ ర్యాంపుల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆరాంఘర్ నుంచి జూ పార్కు వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు, శాస్త్రిపురం ఆర్వోబీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
అంతకు ముందు కమిషనర్ ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో చార్మినార్ను పర్యాటకులు వీక్షించే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, ప్రాజెక్టు ఈఈ బీఎల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.