నిద్రలేమి వల్లే.. బాలానగర్ ప్రమాదం

- బాలానగర్ ఫ్లైఓవర్‌పై జరిగిన యాక్సిడెంట్..
- ఇదే కారణమంటున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): మీకు నిద్ర సరిపోలేదా.. అయితే వాహనాన్ని నడపకండి.. అలా చేస్తే ప్రమాదం చోటు చేసుకోవడం ఖాయం.. రెండు రోజుల కిందట బాలానగర్ ఫ్లై ఓవర్‌పై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇందుకు నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించగా.. ఈ రోడ్డు ప్రమాదం తొలుత అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు.. ఫిర్యాదు చేసిన మృతుడి సోదరుడిని ఆరా తీశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మణికంఠ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 19న రాత్రంతా డ్రైవింగ్ చేసి, 20వ తేదీన ఉదయం కేపీహెచ్‌బీకి వచ్చాడు. ఆ తర్వాత నిద్రపోలేదు.. కొద్దిపాటి విశ్రాంతి కూడా తీసుకోకుండా ద్విచక్ర వాహనంపై కేపీహెచ్‌బీ నుంచి తిరుమలగిరికి బయలు దేరాడు. సరిగా 11.51 నిమిషాలకు బాలానగర్ ఫ్లైఓవర్‌పైకి ఎక్కి ముందుకు సాగుతున్నాడు. ఏమైందో తెలియదు.. ఫ్లై ఓవర్‌పై కుడివైపు ఉన్న మణికంఠ సరాసరి ఎడమవైపునకు వచ్చి రెయిలింగ్‌ను ఢీకొట్టి గాయాలతో మరణించాడు. నిద్రలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

