బడంగ్పేట్, జనవరి12: జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డివిజన్లకు 20వేల లీటర్ల వరకు నీటి బిల్లుల మినహాయింపు ఇస్తున్నట్లుగానే బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లకు నీటి బిల్లుల మినహాయింపు ఇవ్వాలని మాజీ కార్పొరేటర్లు భిక్షపతి చారి, కీసర గోవర్ధన్ రెడ్డి, పెండ్యాల నర్సింహ సోమవారం జీహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీకి వినతిపత్రం అందజేశారు.
అలాగే బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని నాదర్గూల్ (57వ డివిజన్), ప్రశాంత్ హిల్స్ (58వ డివిజన్), ప్రశాంత్ హిల్స్ డివిజన్, జిల్లెలగూడ (59వ డివిజన్), మీర్పేట్ (60వ డివిజన్), బడంగ్పేట్ (61వ డివిజన్), బాలాపూర్ (62వ డివిజన్) పరిధిలో ఉన్న పాత నీటి బకాయిలను మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రవినాయక్, బీమ్రాజ్, చవ్వ శ్రావణ్ కుమార్, మల్లేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.