బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్
రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు. కొవిడ్ లాంటి ఎన్నో మహమ్మారులను నియంత్రించే వాక్సిన్ ను బయోటెక్నాలజీ నిపుణులేనని గుర్తు చేశారు.
మానవాళి మనుగడకి ముందుచూపుతో, భవిష్యత్ బయోవార్ మహమ్మారులను, పెను సవాళ్లను ఎదుర్కొనే విధంగా మానవాళి బంగారు భవిష్యత్ కోసం కష్టపడుతున్నారని డాక్టర్ అడ్డగట్ల రవీందర్ చెప్పారు. బయోటెక్నాలజీ విభాగంపై సామాజిక సృహయే వేలాది తెలంగాణ నిరుపేద విద్యార్థులకు ఊరట అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలో ఎంసెట్ మెరిట్‌తో నిరుపేద విద్యార్థులకు స్థానిక కళాశాలలో ఇంజినీరింగ్ విద్యా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అభ్యసించే సువర్ణ అవకాశం లభిస్తుందని అన్నారు. దేశమంత ఒక రూల్, కానీ మన తెలుగు రాష్ట్రాలలో మరో రూల్ ఉందని ఆరోపించారు.
దీంతో మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఒక్కో విద్యార్థికి రూ.15-20 లక్షల ఆర్థిక భారం పడుతోందని వాపోయారు. ఎంపీసీ విద్యార్థులు ఐఐటీ జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశం పొందవచ్చని వివరించారు. కానీ బైపీసీ విద్యార్థులు ఆ కోర్సులో చేరేందుకు అవకాశం లేదని అన్నారు. దాంతో వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి లక్షల ఖర్చుతో బీటెక్ చదువుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బైపీసీ విద్యార్థులకు సైతం బీటెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు యూనివర్సిటీలలో బైపీసీ విద్యార్థులకు బీటెక్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి ప్రాధాన్యం పెరిగిందని, ఈ రంగంలో నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

