సుల్తాన్‌బజార్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరమే అర్చక, ఉద్యోగులకు పెద్ద పీఠ వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని మాజీ కేంద్ర మంత్రి సముద్రా ల వేణుగోపాల చారి అన్నారు.
ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆంజనేయ స్వామి దేవాయలయంలో తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం కాండూరి క్రిష్ణమాచారి, అర్చక జేఏసీ కన్వనర్ పరాశరం రవీంద్రాచార్యులు, సభ్యులు సతీష్‌ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఎల్లవేళ లా జీవించాలని గోత్ర నామాలతో అర్చన,అభిషేక పూజలతో పాటు ఆయుష్ హోమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, సుందర కాండ పారాయణం నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం ఏర్ప డిన అనంతరం ఆలయ అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ఏకైక సీఎంగా చరిత్రలో నిలిచి పోతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
