సైదాబాద్ : సైదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టుట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్) సంస్థకు దమ్మాయిగూడకు చెందిన వెంపటి రాధాకృష్ణ గ్రంథాలయానికి సంబంధించిన సుమారు 800 పైగా ఆయుర్వేద వైద్య గ్రంథాలను విరాళంగా అందజేశారని ఆయుష్ సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయుర్వేద వైద్య గ్రంథాలతోపాటు ఔషద మొక్కలకు సంబంధించిన గ్రంథాలు, ప్రకృతి, హోమియోపతి, ఇండియన్ మెడిసిన్‌కు సంబంధించిన జర్నల్స్ మొదలైన అనేక విశేష గ్రంథాలను, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం భాషలలో ఉన్న గ్రంథాలను తమ సంస్థ గ్రంథాలయానికి ఉచితంగా విరాళంగా అందజేశారని, వీటిని డాక్టర్ వీవీ శాస్త్రి పేరు మీద భద్రపరుస్తామని తెలిపారు. గ్రంథాల సేకరణలో డాక్టర్ సాకేత్‌రామ్, లైబ్రరీయన్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.