సిటీబ్యూరో : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ తుపాకులకు ఆయుధ పూజలు నిర్వహించారు. పోలీస్ వాహనాలకు కూడా పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ కమిషనర్లు మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.