శామీర్‌పేట, సెప్టెంబర్ 24: ఉమ్మడి శామీర్‌పేట మండలంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూంకుంట మున్సిపాలిటీలో తూంకుంట మున్సిపాలిటీలో ఐటీసీ సంస్థ ఘన వ్యర్థాలు నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ నిర్వహించారు. అదే విధంగా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పంచాయతీ సమావేశ మందిరంలో జిల్లా మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం స్వచ్ఛతహీ సేవా కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమాలు, తడి పొడి చెత్త సేకరణ, పాఠశాలల్లో ర్యాలీలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో చెత్త సేకరణ తడి,పొడి నిర్వహణపై అవగాహన పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఎంపీడీవో వత్సలాదేవి, పంచాయతీ అధికారి మంగతాయారు, పంచాయతీ కార్యదర్శులు, తూంకుంట మున్సిపాలిటీలో డీఈఈ సునీత, మేనేజర్ శ్రవణ్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రేణుక రాజవెల్లి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కన్నేశ్వర్రావు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల ఆరోగ్య భద్రతే ధ్యేయం
జవహర్‌నగర్: కార్మికుల ఆరోగ్య భద్రతే ధ్యేయమని కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమిషనర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెయింట్ పీటర్స్‌లో..
మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ఆవరణలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను సేకరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత, డైరెక్టర్ సరోజా రెడ్డి, అనురాగ్ రెడ్డి, పీఆర్వో రవిసుధాకర్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ డిగ్రీ కళాశాలలో..
రామంతాపూర్: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, ఔషధ మొక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు.ఎన్ఎస్ఎస్ చైర్పర్సన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ,మాదక ద్రవ్యాల అక్రమ వినియోగం బహుళ అంతస్థుల భవనాలో దాచిన రహస్య కెమెరాలపై అవగాహన, మహిళలపై వేధింపులు తదితర అంశాలపై అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ జె.విశ్వనాథ్‌కుమార్,వైస్ పిన్సిపాల్ డాక్టర్ రవిప్రసాద్, సభ్యులుఎన్. రాజశ్రీ, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, చంద్రసాగర్, దామోదర్, షకీలా పాల్గొన్నారు.