మేడ్చల్/మేడ్చల్ రూరల్, జూలై 27: సీపీఆర్ ద్వారా మనిషికి పునర్జన్మ అందించే ఓ ప్రక్రియ అని హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ ప్రధాన కార్యాలయంలో సీపీఆర్ అవేర్నెస్ డే నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 500 మందికి సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, గుండెపోటు వచ్చిన సమయంలో సీపీఆర్ చేసి మనిషి ప్రాణాలను కాపాడవచ్చిని తెలిపారు.
ప్రాథమికంగా చేసే ఈ ప్రక్రియ వల్ల మనిషిని దవాఖానకు తీసుకెళ్లే లోపు ప్రాణాలను రక్షించవచ్చన్నారు. మనిషికి పునర్జన్మ అందించే సీపీఆర్‌పై సరైన అవగాహన కల్పించుకున్నప్పుడే అత్యవసర సమయంలో చేయడానికి వీలవుతుందన్నారు. ప్రజలు కూడా సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలని కోరారు. అలాగే శామీర్‌పేట మండలం దేవరయాంజాల్ పరిధిలోని ఈఎంఆర్ఐ ప్రధాన కార్యాలయంలో కూడా సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం డాక్టర్ పృథ్వీ, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ డైరెక్టర్ వెంకటేశం, ఈఎంఎల్సీ డైరెక్టర్ డాక్టర్ రమణా రావు, 108 రాష్ట్ర కార్య నిర్వహణ అధికారి ఎంఏ ఖలీద్, ఈఎంఆర్ఐ మేడ్చల్, హైదరాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షస్త్రక్ జాన్ షాహిద్, వైద్యులు జావిద్, రవీన్, సిబ్బంది పాల్గొన్నారు.