సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతో జీహెచ్ఎంసీకి అవార్డులు లభించాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2023’లో నగరానికి ఐదు అవార్డులు వచ్చాయి. ఈ నెల 11న న్యూఢిల్లీలో బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ కేంద్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నుంచి అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి అవార్డులు అందజేశారు.