రవీంద్రభారతి, మార్చి 21 :విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఐఆర్ఎస్ డైరెక్టర్ (సీఐటీ) బి.యాకిల్ చంద్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, లిబ్బి బెంజిమెన్ అన్నారు. దీపికా చిల్డ్రన్స్ లీగ్ (డీసీఎన్) మలయాళం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్షిప్ పోటీలలో విజేతలుగా నిలిచిన 20 మంది తెలంగాణ విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా (డీసీఎన్) మలయాళం సంస్థ విద్యార్థులకు జాతీయస్థాయి ప్రతిభ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన టాలెంట్ పరీక్షలో ప్రథమ బహుమతి పొందిన నాగర్‌కర్నూల్‌కు చెందిన విద్యార్థి డి.లోహిత్కుమార్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ పి.మధన్మోహన్, రాయ్ కన్నన్చీరా, వర్గేసి కోచికునేల్, జోబిషర్, తదితరులు పాల్గొన్నారు.