హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): మేజర్ ఆటో హిమోథెరపీ (ఓజోన్ థెరపీ) ద్వారా పలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని పలు అధ్యయనాల ద్వారా రుజువైందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలర్జి చైర్మన్, పల్మనాలజిస్ట్, ఎలర్జి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. భారత ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ విభాగంలో ఇది కూడా ఒక చికిత్స విధానమని అన్నారు. ఈ చికిత్సా విధానంపై దేశంలో కొన్ని వందల మంది ఆయుష్ విభాగం వైద్యులు శిక్షణ పొందినప్పటికీ.. దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేక ఈ చికిత్సా విధానం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదని చెప్పారు. ఓజోన్ థెరపీ చికిత్సా విధానంలో రెండు రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయని, ఒకటి మైనర్ ఆటో హిమోథెరపీ చికిత్స విధానం 2. మేజర్ ఆటో హిమోథెరపీ విధానమని వివరించారు.
అల్లోపతిలో లేదు
ఈ చికిత్సా పద్ధతి క్లినికల్ ప్రాక్టీస్‌లో కూడా ఉన్నదని డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. అయితే దీనిపై అల్లోపతి వైద్యులకు శిక్షణ లేనందున ఇది అల్లోపతి విధానంలో అందుబాటులోకి రాలేదని అన్నారు. ఓజోన్ థెరపీ అనేది ప్రధానంగా ‘న్యూరో డీజనరేటివ్ డిసీసెస్’, వాస్కులార్ (రక్త నాలాలు, రక్తానికి సంబంధించిన) వ్యాధులకు వినియోగిస్తారని, దీని వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపారు.
భయంకరమైన క్రిమి కీటకాలను ఎదుర్కొంటుంది
స్టఫలోకాకస్, ఏరియస్, ఇశ్చరిచియాకోలై, సూడోమోనాస్, ఎంటరోకాకస్ వంటి భయంకరమైన క్రిములు, కీటకాలను సమూలంగా నిర్మూలించే శక్తి ఈ ఓజోన్ థెరపీకి 99.6శాతం ఉన్నట్టు వైద్యపరిశోధనల్లో తేలిందని డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. కరోనా వ్యాధి విజృంభించిన సమయంలో ప్రపంచ నలుమూలల అతిపెద్ద వైద్య సంస్థల్లో కూడా ఎంఏహెచ్ (మేజర్ ఆటో హిమోథెరపీ) చికిత్సా విధానాన్ని వైరస్ క్రిములపై ప్రయోగించారని వివరించారు. సాధారణ రోగులే కాకుండా ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులపై కూడా ఈ చికిత్సా విధానాన్ని అమలుచేయగా, ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. ఈ ఓజోన్ థెరపీతో కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టవచ్చని వైద్యనిపుణులు నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు.
ఓజోన్ చికిత్సా పద్ధతి:
రోగి నుంచి ఐవీ ట్యూబ్ ద్వారా 50-100ఎంఎల్ రక్తాన్ని తీస్తారని, తరువాత ఆ రక్తాన్ని ఓజోన్‌తో కలిపి తిరిగి మళ్లీ అదే రోగికి ఎక్కిస్తారని డాక్టర్ నాగేశ్వర్ చెప్పారు. ఈ విధంగా 5 నుంచి 6 సైకిల్స్ చేసిన అనంతరం రోగి వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరగడం, కొవిడ్ వల్ల రోగి రక్తం గడ్డ కట్టకుండా ఉండటం, రక్తంలో ఉన్న సైటోకైన్స్ విజృంభించకుండా కాపాడడం వంటి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఈ చికిత్సా విధానంలో ఒక సైక్లింగ్‌కు 20-30 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ బాధితులకు వరం: డాక్టర్ నిర్లేప ప్రసాద్
కొవిడ్ ఇన్ఫెక్షన్ ప్రారంభంలోనే ఓజోన్ థెరపీ తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఏర్పడే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రక్తం గడ్డకట్టే దుష్పరిణామాలు ఎదుర్కొనే రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరంగా చెప్పవచ్చు.
ఓజోన్ థెరపీ వల్ల కలిగే లాభాలు: