మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 23:11:11

అత్తర్ల చాటున.. ఈ-సిగరెట్ల విక్రయం

అత్తర్ల చాటున.. ఈ-సిగరెట్ల విక్రయం

-వ్యాపారి అరెస్ట్‌.. సామగ్రి స్వాధీనం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అత్తర్ల విక్రయాల చాటున నిషేధిత ఈ-సిగరెట్లను అమ్ముతున్న ఓ వ్యాపారిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. శాలిబండకు చెందిన సయ్యద్‌ నూర్‌ సల్మాన్‌ మొజంజాహీ మార్కెట్‌ ప్రాంతంలో ‘గుల్నార్స్‌ పర్‌ఫ్యూమ్‌' పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. పర్‌ఫ్యూమ్‌తో పాటు నిషేధిత హుక్కా ఫ్లేవర్స్‌, ఈ-సిగరెట్లు, వాటి ఫ్లేవర్లు, ఈ-సిగరెట్‌ యంత్రాలు విక్రయిస్తున్నట్లు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జావెద్‌ బృందానికి సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి దుకాణంపై దాడి చేసి, ఈ-సిగరెట్లు, స్మోక్‌ జూస్‌, హుక్కా ఫ్లేవర్స్‌ తదితర వస్తువులు సుమారు రూ. 2 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు పట్టుబడిన వస్తువులను విచారణ నిమిత్తం అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు.


logo