బంజారాహిల్స్, సెప్టెంబర్ 7 : ప్రేమిస్తున్నానంటూ నమ్మించి యువతిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని జహీరానగర్‌కు చెందిన యువతి జూబ్లీహిల్స్‌లో ని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నది. అక్కడే జూనియర్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కొండబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అయి తే అప్పటికే కొండబాబుకు పెండ్లి అయినట్లు తెలుసుకున్న యువతి అతడిని నిలదీసింది. తన భార్యకు విడాకులు ఇస్తానని నమ్మబలికాడు. నెల లు గడిచినా పెండ్లి మాటెత్తకపోవడంతో ఈనెల 6న కొండబాబు పనిచేస్తున్న దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా..పెండ్లిచేసుకునే ప్రసక్తే లేదంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376(2)తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు.