దుండిగల్, ఏప్రిల్ 15: తనతో పాటు సోషల్ మీడియా క్యాంపైనర్‌గా పనిచేస్తున్న యువతిని లోబర్చుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా గర్భం దాల్చింది. దీం తో బాధిత యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా అతను ముఖం చాటేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం… భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు చెందిన బొల్లం సంజీవరావు కొడుకు బొల్లం ఏసుదాస్ డేవిడ్ (43) ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి లోని మల్లంపేటలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ గా పనిచేసే డేవిడ్.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వద్ద సోషల్ మీడియా క్యాంపైనర్ గా పనిచేస్తున్నాడు.
అదే సమయంలో అక్కడే తనతో పాటు పనిచేస్తున్న యువతి(21) పై మనసు పడ్డాడు. యువతిని మాయ మాటలతో వలలో వేసుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పా ల్పడ్డాడు. ఇటీవల యువతి పరీక్షలు చేయించగా 4 నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని డేవిడ్‌ను కోరగా తప్పించుకు తిరుగుతున్నా డు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పగా బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా.. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మల్లంపేటలోనే నివాస ఉం టుండడంతో బాధితురాలి తల్లి ఈ నెల 13న దుండిగల్ పోలీసులకు ఫి ర్యాదు చేసింది. అయితే ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జ రగడంతో జీరో ఎఫ్ఐఆర్ను నమో దు చేసిన దుండిగల్ పోలీసులు అనంతరం కేసును బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో మంగళవారం డేవిడ్ ను రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు డేవిడ్‌కు భార్య తో పాటు పెండ్లీడుకు వచ్చిన కూతురు, కొడుకు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.