మాదన్నపేట, మే 30 : మైనర్‌పై లైంగిక దాడి చేసిన ఒకరిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి ఏకలవ్యనగర్‌లో నివాసముండే జనార్దన్ బెల్ట్‌షాపు నిర్వహిస్తూ ఉంటాడు. శనివారం ఉదయం ఇంటి పక్కనే నివసించే మైనర్‌ను ఇంట్లోకి పిలిచి లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఆడుకోవడానికి రాగా..
గాజులరామారం, మే 30 : ఇంట్లో ఆడుకోవడానికి వచ్చిన మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన జగద్గిరిగుట్టలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధికి చెందిన మైనర్ తరచూ ఆడుకోవడానికి వరుసకు పెద్దనాన్న అయిన రాములు ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన రాములు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడగా ఈ నెల 24న దవాఖానకు తీసుకు వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆరు నెలల గర్భిణిగా తేల్చారు. దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా విషయం చెప్పింది. వెంటనే వారు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇన్స్పెక్టర్ యాదగిరి ఈ కేసు విత్‌డ్రాకు ప్రయత్నించారన్న విషయం తన దృష్టికి రాలేదని.. ఓ వేళ అది నిజమైతే ఎస్సైపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.