ఉస్మానియా యూనివర్సిటీ, మే 26: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్ల నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. వర్సిటీ ఆ నిధుల గురించి ఎదురుచూస్తోందని చెప్పారు. ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. 2025 ఆగస్టులో ఓయూను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. వర్సిటీ అభివృద్ధికి వెయ్యికోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారని ఖాసీం గుర్తుచేశారు.
అయితే ఇచ్చిన హామీ మేరకు అదే ఏడాది డిసెంబర్లో వచ్చి నిధుల మంజూరు ఉత్తర్వుల కాపీని అందజేశారన్నారు. అలాగే వెయ్యి కోట్ల నిధుల కేటాయింపును బడ్జెట్లో సైతం పేర్కొన్నప్పటికీ, ఇప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఖాసీం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.