హైదరాబాద్ : ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ్గర 2000 మంది ఆర్టిజెన్స్ ధర్నా చేపట్టారు. విద్య అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టిజెన్స్ను రెగ్యులర్‌గా చేయాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్నాలో రెండు వేల మందికిపైగా ఆర్టిజన్లు పాల్గొనడంతో సెక్రటేరియట్ వైపు నుంచి మింట్ కాంపౌండ్ కు వెళ్లే రోడ్డును పోలీసులు మూసేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
TGSPDCL కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన 2000 మంది ఆర్టిజెన్స్.
ధర్నాతో దద్దరిల్లిన మింట్ కాంపౌండ్‌లోని TGSPDCL కార్యాలయం.
ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్.
విద్య అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని… pic.twitter.com/xL14pjdUSX
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024