సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): యువతి మృతికి కారణమైన డ్రైవర్‌ను మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 14 రోజులపాటు రిమాండ్‌కు పంపారు. వివరాల్లోకి వెళితే.. నేరేడ్మెట్కు చెందిన అజయ్, జెన్నిఫర్లు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై మాదాపూర్ నుంచి నేరేడ్మెట్కు వెళ్తుండగా మాదాపూర్ సీఐఐ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనకాల నుంచి అతి వేగంగా కారులో వచ్చిన సృజన్ వీరిని ఢీకొట్టాడు. సంఘటనలో ద్విచక్రవాహనం వెనకాల కూర్చున్న జెన్నిఫర్ తలకు తీవ్ర గాయాలై మృతిచెందింది. అజయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. అయితే నిర్లక్ష్యంగా కారును నడిపినందుకు సృజన్‌పై మాదాపూర్ పోలీసులు మోటర్ వెహికిల్ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేశారు.